NLTC is pleased to announce that there will be Srinivasa (Balaji) kalyanotsavam in the Netherlands.
We invite all devotees of Lord Balaji to take advantage and have Darshan.
Date : Saturday, 10 May 2025 – 8 AM – 2PM
Venue: Arya Samaj Nederland ASAN, 1e van der Kunstraat 75, 2521 AS Den Haag
DARSHANAM registration is only for adults. Kids under 18 can join for free with registration.

Registration Links
సిరికి హరికి కళ్యాణం – నింగికి నేలకు శుభ యోగం
సిరికి హరికి కళ్యాణం
నింగికి నేలకు శుభ యోగం
ఆకాశాన్ని అంటుతున్న ఆనందం
ఆకాశ రాజింట విరిసె వైభోగం
పద్మ నేత్రి మానసము పండగ జేసె
పద్మావతి కన్నుల కాంతులు మెరిసె
వకుళ మాత వరములోని వేడుక చూడ
ద్వాపర వరము తీర దరి జేరాడు
కార్యము ఖాయమని అభయము నొసగి
కరము జాచి కళ్యాణానికి కబురంపాడు
సురముని జన సందోహం సమాయత్తమై
తండోప తండాలుగ తరలి వచ్చిరి
అజుడు భవుడు పెళ్ళి పెద్దలై
పుడమినంత పీఠ జేసి పందిరేసిరి
శ్రీనివాస కళ్యాణం శుభముగ విరిసె
నిత్య కళ్యాణాల నిండుగ మెరిసె
కనినంత పండగ కనుల నిండుగ
విశ్వమంత వేడుక వీనుల విందుగ
లోక కళ్యాణానికి ఊపిరి పోసి
శోఖములను తొలగించి శాంతిని కూర్చి
అభాగ్యమన్నదాని అంతము చూసి
సౌభాగ్య సంపదలకు స్థిరమొసగేను
శ్రీనివాస కళ్యాణం సర్వ మోదము
ఆ తీరు తెలిసి తలచుకున్న శుభయోగము
తిలకించు వారికి శుభము శుభము
కళ్యాణ మూర్తికి జయము జయము
రచన: శ్రీరంగం జోగి పంతులు గారు